భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 21 : ప్రతి ఒక్కరూ చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ హ్యాండీక్రాప్ట్స్‌ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో 49 ప్రొడ్యూసర్ కంపెనీలు ఉన్నట్లు తెలిపారు. ఈ షోరూం పైలెట్ ప్రాజెక్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూ.20 లక్షలతో ఫండింగ్ చేయడం జరిగిందన్నారు. చేనేత వస్త్రాలకు తెలంగాణలో హ్యాండ్లూమ్ మార్క్, సిల్క్ మార్క్ లేబుల్ ఉండేలా ఏర్పాటు చేయాలని, సెప్టెంబర్ నెల నుంచి లేబుల్‌కు సంబంధించిన ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. ఇలాంటి షో రూమ్‌ల వల్ల కొనుగోలుదారులు డైరెక్ట్ గా కొనుగోలు చేయడమే కాకుండా తక్కువ ధరకు వస్త్రాలు లభిస్తాయన్నారు.
చేనేత రంగo అభివృద్ధి, కార్మికులను ఆదుకోవాలనే లక్ష్యంతో షోరూంలు ఏర్పాటు, మార్కెటింగ్, మంచి క్వాలిటీ, వినియోగదారులకు తక్కువ ధరకు అందించడం వంటి అంశాలను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. రైతుల మాదిరిగా చేనేత కార్మికులకు భద్రత, ఇన్సూరెన్స్, పొదుపు, నేతన్న భరోసా వంటి పలు పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. చేనేతను ప్రోత్సహించి, భవిష్యత్ తరాలకు మన అద్భుత కలను ధరించుకుంటూ చూపించుకోవాలన్నారు. మగవారికి పూర్తి స్థాయిలో చేనేత రెడీమేడ్ దుస్తులు తీసుకు రావాలని సూచించారు. వినియోగదారులకు అన్ని రకాల చేనేత వస్త్రాలు అందుబాటులోకి తీసుకువచ్చిన తడక రమేశ్ దంపతులను ఆమె అభినందించారు.
ఈ కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత, వీవర్ సర్వీస్ సెంటర్ ఉన్నతాధికారి అరుణ్ కుమార్, జిల్లా చేనేత, జౌళి శాఖ ఏడీ శ్రీనివాసరావు, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, మండల తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, పోచంపల్లి ప్రొడక్షన్ హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాప్ట్స్ ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్ తడక రమేశ్, జిల్లా నాయకులు తడక వెంకటేశ్, టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు భారత లవ కుమార్, బీజేపీ రాష్ట్ర నాయకుడు దాసరి మల్లేశం, ఎం ఆర్ ఐ గుత్తా వెంకట్ రెడ్డి, నాయకులు చింతకింది రమేశ్, ముసుకూరి నరసింహ, గుండు ఉప్పలయ్య, కుడికాల బాల నరసింహ, వలందాసు ప్రవీణ్ పాల్గొన్నారు.
Bhoodan Pochampally : ప్రతి ఒక్కరూ చేనేత రంగాన్ని ప్రోత్సహించాలి : శైలజా రామయ్యర్