రాజాపేట, సెప్టెంబర్ 07 : సాలార్జంగ్ మ్యూజియం బోర్డు డైరెక్టర్‌గా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సోమారం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శీలం రాజిరెడ్డి నియమితులయ్యారు. సోమారం గ్రామానికి చెందిన శీలం లింగారెడ్డి–రుక్కమ్మ దంపతుల రెండో కుమారుడైన డాక్టర్ రాజిరెడ్డిని గెజిట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ద్వారా సాలార్జంగ్ మ్యూజియం బోర్డు సభ్యుడిగా నామినేట్ చేసినట్లు బోర్డు కార్యదర్శి ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్ వెల్లడించారు. సెప్టెంబర్ 1న వెలువడిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం నోటిఫికేషన్ తేదీ నుంచి ఐదేళ్ల పాటు ఆయన బోర్డు సభ్యుడిగా కొనసాగనున్నారు.
సాలార్జంగ్ మ్యూజియం అభివృద్ధి, పరిరక్షణ, నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన తన అనుభవంతో కీలకంగా భాగస్వామ్యం కానున్నారు. నియామకం అనంతరం డాక్టర్ శీలం రాజిరెడ్డి గవర్నర్‌ను, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డిని కలిసి తన నియామకంపై అభినందనలు అందుకున్నారు. ప్రతిష్ఠాత్మకమైన సాలార్జంగ్ మ్యూజియం బోర్డులో డైరెక్టర్‌గా అవకాశం లభించడం పట్ల సోమారం గ్రామస్థులు, రాజాపేట మండల ప్రజలు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ రాజిరెడ్డికి సాలార్జంగ్ మ్యూజియం బోర్డు కార్యదర్శి ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్‌తో పాటు పలువురు అభినందనలు తెలిపారు.