రామన్నపేట, జూన్ 20 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని యాదాద్రి భువనగిరి డీఈఓ సత్యనారాయణ కోరారు. శుక్రవారం రామన్నపేట మండలంలోని బోగారం ప్రాథమిక పాఠశాలలో దాతల సహకారంతో 1 నుండి 7వ తరగతుల్లో మొదటి, ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకంతో పాటు బహుమతులను ప్రదానం చేశారు. గ్రామస్తులు పాఠశాలలో కనీస వసతులు కల్పించడం పట్ల వారిని అభినంధించారు. అనంతరం 1వ తరగతిలో నూతనంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గవ్వ జ్యోతి, ప్రధానోపాధ్యాయులు ముస్కు వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
Ramannapet : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలి : డీఈఓ సత్యనారాయణ