యాదగిరిగుట్ట, మే 12 : క్షయ వ్యాధి నివారణలో సీవై-టీబీ పరీక్ష కీలక పాత్ర పోషిస్తుందని టీబీ ప్రోగాం యాదాద్రి భువనగిరి జిల్లా ఆఫీసర్, డాక్టర్ సాయిశోభ అన్నారు. జిల్లాలో తొలిసారిగా సీవై-టీబీ పరీక్షను పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం విజయవంతంగా ప్రారంభించి పలువురికి పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీవై- టీబీ పరీక్షతో క్షయవ్యాధి (టీబీ)ని మరింత శ్రీఘ్రంగా, ఖచ్చితంగా గుర్తించడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ పరీక్ష ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. టీబీ నిర్మూలన దిశగా ఇది ఒక మైలురాయి కాబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ పావని, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.