చౌటుప్పల్ , జూన్ 13 : చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో అసంపూర్తిగా నిలిచిన సర్వీస్ రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గత 4 నెలల క్రితం పనులు చేపట్టి నేటికి పూర్తి చేయడం లేదన్నారు. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా నూతనంగా నిర్మిచిన డ్రైనేజీ పనుల్లో నాణ్యత లోపించి వాహనాలు వెళ్లితే కూలుతున్నట్లు మండిపడ్డారు.
వానాకాలంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. తక్షణమే కాంట్రాక్టర్లు త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి పల్లె శేఖర్‌రెడ్డి, మున్సిపాలిటి కార్యదర్శి పగిళ్ల మోహన్‌రెడ్డి, నాయకులు ఉడుత రామలింగం, కొండూరి వెంకటేశ్, టంగుటూరి రాములు, బోయ మంకులు, బెదరకోట యాదయ్య, యు.నర్సింహ్మ, రేగొండ భిక్షపతి, ఏ.శ్రీను పాల్గొన్నారు.
Choutuppal : చౌటుప్పల్‌లో సర్వీస్ రోడ్డు పనులు చేపట్టాలని సీపీఐ నిరసన