రాజపేట ఏప్రిల్ 20 : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై మే 20న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జెల్లా బాహూపేట వెంకటయ్య, మండల కార్యదర్శి చిగుర్ల లింగం అన్నారు. ఏఐటీయూసీ అనుబంధ సంఘమైన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నాలుగవ మహాసభల పోస్టర్లను రాజాపేట మండలం బేగంపేట గ్రామంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడాతూ..కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ కార్మికులకు పెన్షన్లు గుర్తింపు కార్డులు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కార్మిక చట్టాల మార్పును రద్దు చేయాలన్నారు. తెలంగాణలో నిర్మాణ రంగంలో పనిచేస్తున్న లక్షల మంది నిర్మాణ కార్మికులైన తాపీ, ఇటుక, రాయి, కంకర సెంట్రింగ్ రాడ్, బెండింగ్, ప్లంబర్, ఎలక్ట్రిషన్, వడ్రంగి, కాంక్రీట్ మిక్సింగ్ పెయింటర్స్, మార్బుల్ రంగాలలో పనిచేసే కార్మికులందరికీ సంక్షేమ బోర్డులో సభ్యులుగా నమోదు చేసి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 21, 22 తేదీలలో శంషాబాద్ లో జరుగు మహాసభలకు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొనే విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శి మూల హరినాథ్, నీల నరసింహులు, కర్రె బాలరాజు, దేవి మల్లేశం, నీల జాంగిర్ పాల్గొన్నారు.