వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమి లేదు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల్లో చేసింది ఏమీ లేదని, మిగిలిన 750 రోజుల్లో ఏం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు. బుధవారం భువనగిరిలోని...
భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 02 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల్లో చేసింది ఏమీ లేదని, మిగిలిన 750 రోజుల్లో ఏం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు. బుధవారం భువనగిరిలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ తీరుగా తయారు చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెసోళ్లు రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నాయకులపై, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తూ రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెసోళ్లు బిజెపి నాయకులపై దాడి చేయాలనే కార్యక్రమాలు పెట్టుకున్నారని, ఇటీవల నల్లగొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిలోకి వెళ్లి అధ్యక్షుడి తల్లిని భయభ్రాంతులకు గురి చేశారన్నారు.
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ప్రజలు బిజెపిని అధికారంలోకి తెచ్చారని, తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. దళితులు ఆరాధ్య దైవంగా భావించే సంత్ రవిదాస్ ఫొటోపై కూడా నల్లరంగు పోశారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీపై దాడులు అధికమవుతున్నాయని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రదర్స్ అండ్ కంపెనీ పాలన నడుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

