బీబీనగర్, జూన్ 17 : చిన్నారుల సమగ్ర అభివృద్ధి అంగన్వాడీల్లోనే సాధ్యం అవుతుందని డీడబ్ల్యూఓ నర్సింహారావు అన్నారు. బీబీనగర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన అమ్మ మాట – అంగన్వాడీ బాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. అంగన్వాడీల్లో పిల్లలకు ఆటపాటలతో పాటు బాలామృతం వంటి పోషక ఆహారాలను, విద్యను అందిస్తున్నట్లు వెల్లడించారు. అంగన్వాడీలో చదివిన పిల్లలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ శైలజ, సూపర్వైజర్ కరుణ, టీచర్ విజయలక్ష్మి, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.