ఆత్మకూరు(ఎం), అక్టోబర్ 25 : ఆత్మకూరు(ఎం) మండల వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో మండలంలోని పోతిరెడ్డిపల్లి బిక్కేరు వాగుపై నిర్మించిన కాజ్ వే కూలిపోయింది. అదేవిధంగా కొరటికల్ బిక్కేరు వాగుపై నిర్మించిన కాజ్వే కుంగిపోవడంతో పాటు కూరెళ్లలోని మూసీ వాగుపై నిర్మించిన కాజ్ వే కొట్టుకుపోయింది. ప్రతిరోజు వివిధ గ్రామాల ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు కాజ్ వేల పైనుండి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాజ్ వేల పైనుండి వెళ్తున్నారు. కుంగిపోయి కూలిపోయిన కాజ్ వేలు ప్రమాదకరంగా మారాయి. సంబంధిత ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి నూతన కాజ్ వే ల నిర్మాణాన్ని చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Atmakur(M) : కూలుతున్న కాజ్ వేలు.. పొంచి ఉన్న ప్రమాదం

Atmakur(M) : కూలుతున్న కాజ్ వేలు.. పొంచి ఉన్న ప్రమాదం