చౌటుప్పల్:చౌటుప్పల్ బస్టాండ్ శుక్రవారం జలమయ్యింది. కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు చౌటుప్పల్ పెద్ద చెరువు నిండుకొని అలుగు పోస్తుంది. ఈ అలుగు నీరు బస్టాండ్‌కు సమీపం నుంచి పారుతుడడంతో..అలుగు ఊటతో చౌటుప్పల్ బస్టాండ్‌లోకి నీరు చేరుకుంది. ఈ నీటి గుండానే ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించాయి.