యాదాద్రి: చేనేత కార్మికుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్నకు చేయూత పథకాన్ని ప్రతి చేనేత కార్మికుడు సద్వినియోగించుకోవాలని జౌళీ శాఖ ఏడీ విద్యాసాగర్ తెలిపారు. శుక్ర వారం యాదగిరిగుట్ట పట్టణంలోని చేనేత సహకార సంఘం కార్యాలయంలో చేనేతకు చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించి పలువురిని నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా చేనేతలు కొనుగోలు చేసిన నూలు, రసాయాలు, అద్ధకంపై 40శాతం సబ్సిడీ అందిస్తుందన్నారు. కార్యక్రమంలో పట్టణ చేనేత సహ కారం సంఘం అధ్యక్షుడు నారా నరేందర్, కార్యదర్శి మెరుగు కోశాధికారి బడుగు మల్లేశం, మేనేజర్ గంజి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.