‘పద్ధతి మార్చుకొని పనిచేయండి.. లేకపోతే లైసెన్స్ బ్లాక్ లిస్ట్లోకి’
పద్దతి మార్చుకొని పని చేయించండి లేకపోతే కాంట్రాక్ట్ లైసెన్సును బ్లాక్ లిస్టులో పెడ్తానని అదనపు కలెక్టర్ భాస్కర్రావు దవాఖానా శానిటేషన్ కాంట్రాక్టర్ను హెచ్చరించారు. బుధవారం రామన్నపేట ప్రభుత్వ దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
– యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు
రామన్నపేట, మార్చి25 : పద్దతి మార్చుకొని పని చేయించండి లేకపోతే కాంట్రాక్ట్ లైసెన్సును బ్లాక్ లిస్టులో పెడ్తానని అదనపు కలెక్టర్ భాస్కర్రావు దవాఖానా శానిటేషన్ కాంట్రాక్టర్ను హెచ్చరించారు. బుధవారం రామన్నపేట ప్రభుత్వ దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశీలించి శానిటేషన్ కాంట్రాక్టర్కు ఫోన్ చేసి నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో దవాఖాన సూపరింటెండెంట్ సూచనలతో పనులు చేపట్టాలని ఆదేశించారు. సిబ్బందిని నియమించి పూర్తి స్థాయిలో పనులు చేపట్టకపోతే షోకాజ్ నోటీసులు జారిచేసి కాంట్రాక్ట్ లైసన్స్ ను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు.
వైద్యులు, వైద్య సిబ్బంది డిప్యూటేషన్లను రద్దు చేయాలని డీసీహెచ్ఎస్ ను ఫోన్లో ఆదేశించారు. దవాఖాన ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను, డ్రైనేజీ నిర్మాణ పనులను చేయించాలని ఎంపీడీఓ ఆవుల రాములును ఆదేశించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ట్యాక్స్ కలెక్షన్ ఇతర రికార్డులు సరిగ్గా నమోదు చేయక పోవడంతో చర్యలు తీసుకోవాలని డీపీఓను ఫోన్లో ఆదేశించారు. అనంతరం పల్లె ప్రకృతివనం, సర్సరీలను పరిశీలించారు. పల్లె ప్రకృతివనంలో చెట్లను తీసివేయడంపై తాసీల్దార్ లాల్ బహదూర్ ను విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట దవాఖాన సూపరింటెండెంట్ శ్వేత ప్రియాంక, ఏపీఓ వెంకన్న, తదితరులు ఉన్నారు.

‘పద్ధతి మార్చుకొని పనిచేయండి.. లేకపోతే లైసెన్స్ బ్లాక్ లిస్ట్లోకి’
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

