చేనేత కార్మికులు స్వయంశక్తితో ఉన్నత స్థితికి ఎదగాలి: కలెక్టర్ పమేలా సత్పతి

భువనగిరి అర్బన్: చేనేత కార్మికులు స్వయంశక్తితో ఉన్న స్థితికి ఎదగాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని వర్తక సంఘం ఆవరణలో చేనేత సంఘం ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం చేనేత జౌళీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
చేనేత కార్మికులు కేవలం పని చేసేవారు మాత్రమే కాదని, వారు వస్ర్తాలతో అద్భుతాలు సృష్టించే సృష్టికర్తలని అన్నారు. చేనేతలు సంసృ్కతి సంప్రదాయాలను భావితరాలకు అందజేస్తున్నారన్నారు. స్వదేశీ ఉద్యయమంలో కార్యరూపం దాల్చిన అహింస, సత్యాగ్రహం నాటి నుంచి చేనేత పరిశ్రమకు మరింత గౌరవం చేకూరిందని తెలిపారు. చేనేత వృత్తికి న్యాయం చేయాలని సూచించారు.
కేవలం మార్కెటింగ్ సౌకర్యాలు లేవనే భావన విడ నాడి తమలోని ప్రతిభకు పదును పెట్టాలని తెలిపారు. మరిన్ని లాభాలు రావాలంటే ఆన్లైన్లో మార్కెటింగ్ సౌకర్యాన్ని విస్తరించుకోవాలన్నారు. మున్సిపల్ కార్మికులకు చేనేత వస్ర్తాలను అందించాలని అధికారులను ఆదేశించా రు. ప్రతి సోమవారం అధికారులు విధిగా చేనేత వస్ర్తాలను ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా వకృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు మెమోంటో, ప్రశంసా పత్రాలు అందజేసి శాలువాలతో సత్కరించారు.
అదే విధంగా రూ.5 కోట్ల ఒక లక్ష విలువైన చెక్కును చేనేత మిత్ర పథకం క్రింద 9 వేల మంది లబ్ధిదారులకు నూతన సబ్సీడీ కింద అందజేశారు. పావలా వడ్డీ పథకం క్రింద 10 సంఘాలకు రూ.22,44,000లక్షల చెక్కును, ఆత్మహత్య చేసుకున్న 25 మంది చేనేత కుటుంబాలకు రూ.5,016వేల చొప్పున అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, చేనేత జౌళీశాఖ డిప్యూటీ డైరక్టర్ వెంకటేశం, వివిధ చేనేత సంఘాల చైర్మన్లు, పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

