భూదాన్ పోచంపల్లి, జూన్ 03 : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో పాడి బర్రె మృతి చెందిన ఘటన మంగళవారం భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలో చోటుచేసుకుంది. ఇంద్రియాల గ్రామానికి చెందిన వoగేటి హంసమ్మ తన పాడి బర్రెలను మేతకని తీసుకెళ్లింది. కాగా బంధారపు అంజయ్య పొలంలో నూతనంగా నిర్మించిన కరెంట్ పోల్ లో ఇన్సులేటర్లు ఇవ్వకుండా విద్యుత్ సిబ్బంది డైరెక్ట్ గా కనక్షన్ ఇవ్వడంతో ఆ విద్యుత్ వైరు తెగి కిందపడింది. మేతకని వెళ్లిన పాడి బర్రెలకు ఆ విద్యుత్ వైర్లు తగలడంతో ఒకటి మృతిచెందింది. మరో మూడు బర్రెలతో పాటు హంసమ్మ విద్యుత్ షాక్కు గురైంది. విద్యుత్ అధికారుల నిర్లక్షంతో రూ.లక్ష విలువ చేసే బర్రె చనిపోయిందని, నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.