ఆలేరు టౌన్, ఏప్రిల్ 21 : హనుమకొండలోని ఎలక్కతుర్తిలో ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ రజోత్సవ సభను విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం ఆలేరు పట్టణ కేంద్రంలోని తన స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గత 15 నెలలుగా కాంగ్రెస్ పార్టీ పాలన గాడి తప్పిందన్నారు. సభ ద్వారా పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశా దశా నిర్దేశం చేసి , శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో 15 నెలలుగా రియల్ ఎస్టేట్ కుదేలై బిల్డర్లు, కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి సుస్థిరమైన పాలన అందించడం కేవలం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో గొర్ల కాపర్ల సంఘం డైరెక్టర్ జల్లి నర్సింహులు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పత్తి వెంకటేశ్, ఆలేరు రైతు విభాగం పట్టణ అధ్యక్షుడు జూకంటి ఉప్పలయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి దయ్యాల సంపత్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జూకంటి ఉప్పలయ్య, చిమ్మి శివమల్లు, యువజన విభాగం నియోజవర్గ ఉపాధ్యక్షుడు ఆలేటి అజయ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.