యాదగిరిగుట్ట, ఏప్రిల్ 16 : ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఅర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను విజయవంతం చేసేందుకు జరిగే సన్నాహక సమావేశం గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని మున్నూరు కాపు సత్రంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య తెలిపారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్ పాల్గొననున్నట్లు తెలిపారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ నాయకులు, గ్రామ శాఖ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, విద్యార్థి, యువజన, సోషల్ మీడియా ప్రతినిధులు, పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్లు, పట్టణ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, పట్టణ సెక్రటరి జనరల్ పాపట్ల నరహరి, మండల సెక్రటరి జనరల్ కసావు శ్రీనివాస్, జిల్లా నాయకులు మిట్ట వెంకటయ్య, గుండ్లపల్లి వెంకటేశ్ గౌడ్, శిఖ శ్రీనివాస్, బీసీ విభాగం మండలాధ్యక్షుడు కవిడే మహేందర్, బీఅర్ఎస్ పట్టణ నాయకులు అరే శ్రీదర్ గౌడ్, నర్సింగ పురుషోత్తం, శారాజీ రాజేశాయాదవ్, తుమ్మల సుధాకర్ పాల్గొన్నారు.