భువనగిరి అర్బన్, జులై 04 : భువనగిరి పట్టణంలోని జగదేవ్‌పూర్ రోడ్డు మార్గంలో ఏర్పడిన గుంతలను గతంలో పరిశీలించి వెంటనే పనులు చేయిస్తానని చెప్పి నెలలు గడుస్తున్నాయని, ఆ పనులను చేయించడంలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి విఫలమైనట్లు బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఎండి.ఖాజా అజీముద్దీన్ అన్నారు. జగదేవ్‌పూర్ చౌరస్తా సమీపంలో ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలను బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం పూడ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుంతలమయంగా మారిన రోడ్డును పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపిస్తానని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే ఇంతకాలం గడుస్తున్నా దానిని పట్టించుకోకపోవడంతో నిత్యం బైక్‌లపై వెళ్తున్న ప్రయాణికులు కిందపడి గాయాలపాలు అవుతున్నట్లు తెలిపారు.
పట్టణంలో ముఖ్యమైన పనులను చేయడం మానేసి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చేసిన పనులకు మళ్లీ కొబ్బరికాయలు కొడుతూ తిరగడమే సరిపోతుందని విమర్శిచారు. భువనగిరి నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులకు గురైతున్న పనులను వెంటనే పూర్తి చేయాలని, లేని పక్షంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నాయకత్వంలో ఆందోళన చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు పెంట నితీశ్, పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి నాగారం సూరజ్, నాయకులు ముజీబ్, రామకృష్ణ, వేముల కృష్ణ, మనీశ్, పోకల శివ, సైదులు, బురాన్, శ్రవణ్, వ్రికాంత్, వసీమ, వినోద్, రొయ్యల పవన్, అమీర్, యువజన నాయకులు పాల్గొన్నారు.
Bhuvanagiri Urban : రోడ్డుపై గుంతలను పూడ్చిన బీఆర్ఎస్ నాయకులు
Bhuvanagiri Urban : రోడ్డుపై గుంతలను పూడ్చిన బీఆర్ఎస్ నాయకులు