బీబీనగర్, ఏప్రిల్ 19 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగనుందని, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పార్టీ రాష్ట్ర నాయకురాలు గాదె కవిత నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పార్టీ ముఖ్య నాయకులతో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ బీఆర్ఎస్ రజతోత్సవ సభపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలపునిచ్చారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందినట్లు తెలిపారు.