భూదాన్ పోచంపల్లి, జనవరి 12 : మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరవేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థులకు అన్ని రకాలుగా సాయం చేస్తామని, అన్ని వార్డులో ఇన్చార్జిలను నియమించి కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టి మోసం చేయవద్దని సూచించారు. గత పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని, కాంగ్రెస్ పాలనతో జనం విసుగెత్తి పోయారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సీత వెంకటేష్, మండలాధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, జిల్లా నాయకులు కోట మల్లారెడ్డి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కoదాల భూపాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బాతుక లింగస్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి గునిగంటి మల్లేశం గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి చిలువేరు బాల నర్సింహ, నాయకులు ముత్యాల మహిపాల్ రెడ్డి, కందాల సుధాకర్ రెడ్డి, కర్నాటి రవి, గుండు మధు, సామల మల్లారెడ్డి, కుడికాల బలరాం, శ్రీను, దేవరాయ కుమార్, నాయకులు పగిళ్ల సుధాకర్ రెడ్డి, బత్తుల శ్రీశైలం గౌడ్, సీత శ్రవణ్, వేముల సుమన్, కొండమడుగు రోషన్, చింతకింది కిరణ్, కుంటోళ్ల మహేశ్, కర్నాటి అంజమ్మ, రాజమణి, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు.

Bhoodan Pochampally : మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలి : మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి