బీబీనగర్, డిసెంబర్ 06 : స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మండలంలో పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇప్పటివరకు ఎవరైనా రెబల్‌గా నామినేషన్ దాఖలు చేసిన వారికి బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ బీబీనగర్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధికారికంగా బలపరిచి ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేయడం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమైన చర్యగా పరిగణించ బడుతుందన్నారు. పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్దులను పార్టీ నుండి సస్పెండ్ అయినట్లుగా భావిస్తామన్నారు. భవిష్యత్‌లో కూడా వారికి బీఆర్ఎస్ పార్టీతో ఏ విధమైన సంబంధాలు ఉండవన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీబీనగర్ మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ బీబీనగర్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు విడుదల చేశారు. రిజర్వేషన్ల ప్రకారం ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. వెంకిర్యాల- నాగలక్ష్మి (ఎస్సీ మహిళ), రాఘవపురం- బండారి శంకర్ గౌడ్ (బీసీ జనరల్), బ్రాహ్మణపల్లి- కొలను వాణి (జనరల్ మహిళ), మహాదేవ్‌పూర్- ఆకుల శ్రీనివాస్ (బీసీ జనరల్), రావిపహాడ్ తండా- బానోత్ శంకర్ నాయక్ (జనరల్) ఏకగ్రీవం, నెమరగోముల- ఆముదాల అపర్ణ (బీసీ మహిళ), మక్తానంతారం- దొంతరపల్లి వెంకటేష్ (జనరల్), బీబీనగర్- పిట్టల అశోక్ ముదిరాజ్ (బీసీ జనరల్), మాదారం- పంజాల సతీష్ గౌడ్ (జనరల్),
గూడూరు- తొర్రి తరంగిణి (ఎస్సీ మహిళ), రాయిరావుపేట్- చినాల వెంకటేష్ (జనరల్), చిన్నరావులపల్లి- కొమిరె శ్రీకాంత్ యాదవ్ (బీసీ జనరల్), జైనపల్లి- నక్కిర్తి హేమలత (జనరల్ మహిళ), జియాపల్లి- యర్కల జమున (జనరల్ మహిళ), జియపల్లి తండా- ధరావత్ గోవింద్ నాయక్ (ఎస్టీ జనరల్), కొండమడుగు- కనకబోయిన గోపాల్ ముదిరాజ్ (బీసీ జనరల్), రహీంఖాన్‌గూడ- నవ్య శృతి (బీసీ మహిళ), ముగ్దుంపల్లి- శెట్టి నరేష్ యాదవ్ (జనరల్), పెద్ద పలుగుతండా- బానోతు నీలా (ఎస్టీ మహిళ), అన్నంపట్ల- నీరుడి జగన్ (ఎస్సీ జనరల్), రుద్రవెల్లి- సుర్వి సరళ (జనరల్ మహిళ), గుర్రాలదండి- బానోత్ కౌసల్య (ఎస్టీ జనరల్), మీది తండా- ధరావత్ హరిచందర్ నాయక్ (ఎస్టీ జనరల్), నీలతండా- బానోత్ శాంతి (ఎస్టీ మహిళ), లక్ష్మీదేవిగూడెం- జిల్కపల్లి పద్మ (బీసీ మహిళ) తదితరులు అభ్యర్థులుగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు తమతమ గ్రామాల అభివృద్ధి, ప్రజా సేవను లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తారని, ప్రజలందరూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాలని రాచమల్ల శ్రీనివాసులు కోరారు.