భూదాన్ పోచంపల్లి, జూన్ 04 : భూదాన్ పోచంపల్లి మండలంలోని భీమనపల్లి గ్రామంలో బ్రొడాయి, పోతరాజు ప్రతిష్ఠ కార్యక్రమాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో హవనం, యంత్ర ప్రతిష్ఠ, బ్రొడాయి ప్రతిష్ఠ, పోతరాజుకు మైలలు తీయుట, యంత్ర ధారణ కార్యక్రమాలు జరిగాయి. మహిళలు బ్రొడాయికి జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కందాల భూపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ కంటే రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజిరెడ్డి, నాయకులు కందాల రఘుమారెడ్డి, చిలువేరు శేఖర్, కంటే లింగం, కలుకూరి పాండు, మల్లేశ్ పాల్గొన్నారు.