భువనగిరి అర్బన్: భువనగిరి పట్టణ టీఆర్ఎస్ పార్టీ కమిటీతో పాటు మహిళా విభాగం, యూత్ కమిటీ, బీసీ సెల్, ఎస్సీ సెల్ కమిటీల నూతన అధ్యక్ష, కార్యదర్శులు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా తమ నియామకానికి కృషి చేసిన సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో భువనగిరి పట్టణ అధ్యక్షుడు ఏవి.కిరణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ మహిళా అధ్యక్షురాలు రత్నపురం పద్మ, ప్రదాన కార్యదర్శి ఇట్టబోయిన పావని, పట్టణ బీసీ సెల్ కమిటీ అధ్యక్షుడు రేఖల ఆనం ద్, ప్రధాన కార్యదర్శి గుండెబోయిన నర్సింహా, పట్టణ యూత్ కమిటీ అధ్యక్షుడు పెంట నితీశ్, ప్రధాన కార్యదర్శి నాగారం సురాజ్, పట్టణ ఎస్సీ సెల్ కమిటీ అధ్యక్షుడు కంచనపల్లి నర్సింగ్‌రావు, ప్రధాన కార్యదర్శి నిలిగొండ శివశంకర్‌లతో పాటు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.