భువనగిరి అర్బన్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా రని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. యువ తెలంగాణ పార్టీ మండలాధ్యక్షుడు ఎల్లంల బాల మల్లేశ్, ఆర్గనై జర్ సెక్రటరీ పాక మహేందర్‌తో పాటు మండల కార్యవర్గ సభ్యులు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మె ల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంద న్నారు. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మారడానికి తాము ప్రభుత్వానికి వెన్నంటి ఉంటామని పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయన్నారు. పార్టీలో చేరినవారిలో కుమార్, రఘునాధ్, నర్సింహ, నరేశ్, నాగరాజు, వంశీ, బాలకృష్ణ, కుమార్, సురేష్‌తో పాటు మరో 20 మంది ఉన్నారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్‌గౌడ్, ఎంపీపీ నరాల నిర్మల యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వరెడ్డి, వైస్ చైర్మన్ మహేందర్‌నాయక్, మండల అధ్యక్షుడు జనగాం పాండు, ప్రధానకార్యదర్శి నీల ఓం ప్రకాశ్‌గౌడ్, నాయకులు అతికం లక్ష్మీనారాయణగౌడ్, జక్కా రాఘవేందర్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, పుట్ట వీరేశ్, తదితరులు పాల్గొన్నారు.