భువనగిరి కలెక్టరేట్: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆర్జీదారుల నుంచి పలు సమస్యలపై వినతులను స్వీకరించి మాట్లాడారు.
ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్ఫందించి పరిష్కార దిశగా అడుగులు వేయాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని అన్నారు. ఈ సందర్భంగా 83 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.