Alair : యాదాద్రి జిల్లా ఆలేరులో వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం కరిసి భారీ వానకు బైరామ్కుంట చెరువు (Bhairamkunta River) కట్ట తెగిపోవడంతో భారీగా వరద నీరు ఇళ్లలోకి చేరింది. ఫలితంగా ఆలేరులోని లోతట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లు, కాలనీలు జలమయం అయ్యాయి. దాంతో, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Beerla Ilaiah) పరిస్థితిని పరిశీలించి.. అధికారుల సమన్వయంతో సహాయక చర్యలను వేగవంతం చేశారు.
బైరామ్కుంట చెరువు నుంచి వరద నీరు రోడ్లను ముంచెత్తింది. వరద నీరు లోతట్టు ప్రాంతాల నుంచి వెల్లివేపోలా జేసీబీతో కాలువ తవ్వించారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. అంతేకాదు అక్కడి ప్రజలను సరక్షిత ప్రాంతాలను తరలించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. 2,3 రోజల పాటు వరద బాధితులకు ఆహారపదార్థాలను పంపాలని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం వరద సయాహక చర్యల గురించి కలెక్టర్ హనుమంతరావు (Hanumantha Rao)తో ఎమ్మెల్యే మాట్లాడారు.