రాజాపేట, ఏప్రిల్ 7 : భూ పరిహారం ఇప్పించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావుకు రాజాపేట మండలం బేగంపేట గ్రామ రైతులు సోమవారం వినతి పత్రం అందజేశారు. సీపీఐ మండల కార్యదర్శి చిగుర్ల లింగం ఆధ్వర్యంలో బేగంపేట గ్రామ రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా గంధమల్ల రిజర్వాయర్ కింద కాల్వల కోసం బేగంపేట గ్రామ రెవెన్యూ పరిధిలో సుమారు 80 ఎకరాల భూమి ఇరిగేషన్ ఖాతాలో వెళ్లిపోయిందన్నారు. గత ఆరు సంవత్సరాల నుంచి రైతులకు ఎటువంటి పరిహారం అందలేదని, అప్పటినుంచి నుంచి తిరుగుతూనే ఉన్నట్లు తెలిపారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ను కలువగా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి చిగుళ్ల లింగం, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్కా వెంకటేశం, మూల పోచయ్య, మూల మల్లేశం, ఒగ్గు కరుణాకర్, రైతులు పగడాల శివశంకర్, బిచ్చాల ప్రభాకర్, ఓరుగంటి లచ్చులు, ఓరుగంటి యాదగిరి, నీల ఉప్పలయ్య, రాగుల భిక్షపతి, మూర సత్తిరెడ్డి, నగరం కళమ్మ, ఓరుగంటి సత్తమ్మ, ఆకుల పద్మ, మూల రాములు, పోతరమైన సత్తయ్య, బోగ శ్రీను, బోడపట్ల యాదగిరి పాల్గొన్నారు.