ఆలేరు టౌన్, జూలై 4 : ఆలేరు మండలం బహదుర్ పేట గ్రామం నుంచి చిన్న కందుకూరు గ్రామాన్ని కలిపే లింక్ రోడ్డును బర్మ మల్లయ్య, బర్మ కిష్టయ్య అనే వ్యక్తులు కబ్జా చేసిన విషయం తెలిసిందే. దీంతో బాధిత ఎస్టీ ఎరుకల కుటుంబాలు, 200 మంది రైతులు తమ ఇండ్లు, పొలాలకు వెళ్లే దారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై బాధితులు ఇప్పటికే స్థానిక పోలీసులు, జిల్లా కలెక్టర్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తాజాగా శుక్రవారం గ్రామానికి చెందిన పలు గిరిజన కుటుంబాలు, రైతులు హైదరాబాద్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు.
దీనిపై మల్లన్న వెంటనే స్పందించారు. ఆలేరు తాసీల్దార్ ఆంజనేయులకు ఫోన్ చేసి గిరిజనులకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాటను వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంపాల శ్రీనివాస్, బహుదూర్పేట మాజీ సర్పంచ్ జంపాల దశరథ, కుండె సంపత్, కూల్ల రామ్ నర్సయ్య, వస్పరి రమేశ్, రాయపురం శ్రీనివాస్, రాయపురం ఎల్లయ్య, రాయపురం భాస్కర్, పడతం వెంకటేశ్, చిన్నం వెంకటేశ్, దొంతుల రాములు, దొంతుల నరేశ్, రాయపురం శోభ, రాయపురం లక్ష్మి, పరశురాములు పాల్గొన్నారు.