బీబీనగర్: అవగాహనతోనే క్యాన్సర్ ను నివారించవచ్చునని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా అన్నారు. సోమవారం మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్‌లో ప్రసూతి, గైనకాలజీ విభాగం ఆధ్వర్యంలో గైనకాలజికల్ క్యాన్సర్ నివారణ, స్క్రీనింగ్‌పై సిబ్బందికి సాధారణ ప్రజలలో అవగాహన కల్పించడానికి సెప్టెంబర్ నెల మొత్తం వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్, హెచ్‌పీవీకి వ్యతిరేఖంగా టీకాలు వేయడం, వంశ పారంపర్య క్యాన్సర్ సిండ్రోమ్స్ వంటి వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో డీన్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ నరాంగ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీరజ్ అగర్వాల్, డాక్టర్లు, ప్రొఫెసర్లు, నర్సింగ్ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.