చౌటుప్పల్, సెప్టెంబర్ 17 : దుర్గామాత మండపాల ఏర్పాటు కోసం నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సీఐ మన్మధ కుమార్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. http://policeportal.tspolice.gov.in/index.htm కు లాగిన్ అయి వివరాలను నమోదు చేసుకుని పోలీసులకు సహకరించాలన్నారు. అందులో మండపాల కమిటీల పూర్తి వివరాలు, ఫోన్ నెంబర్ పొందుపరచాలన్నారు. అంతేగాకుండా మండపంలో డీజేలను వాడారాదన్నారు. అగ్ని ప్రమాదాలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనుమానాస్పద బ్యాగులు, వ్యక్తులు కనబడితే వెంటనే 100 నెంబరకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.