యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగరి జిల్లాలోని ఆలేరు పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని రెవెన్యూ డివిజన్ పోరాట సాధన కమిటీ అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం ఆలేరు బంద్‌కు పిలుపుని చ్చారు. దీంతో పట్టణంలోని అన్ని వ్యాపార సముదాయాలు ఆఫీసులు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు బంద్‌ను పాటించాయి. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ..ఆలేరును వెంటనే రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలన్నారు.
లేనిపక్షంలో ఆలేరు ప్రజలతో కలిసి మరో దశ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన రెవెన్యూ డివిజన్ హామీని వెంటనే అమలు చేయాలని కోరింది. డిమాండ్లు నెరవేరకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనలు మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.