భూదాన్ పోచంపల్లి, మే 28 : సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైన భూదాన్ పోచంపల్లి ఇక్కత్ చీరలకు ఆఫ్రికా బృందం ఫిదా అయింది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆఫ్రికా ఖండంలో 15 మధ్య పశ్చిమ ఆఫ్రికా దేశాలకు చెందిన 30 మంది సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు బుధవారం భూదాన్ పోచంపల్లిని సందర్శించారు. టూరిజం పార్క్ లోని భూదానోద్యమం, చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియలను వారు పరిశీలించారు. స్థానిక సంస్కృతి, కలలు, మ్యూజిక్ తో మమేకమయ్యారు. చేనేత మగ్గాలపై తయారవుతున్న పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను తిలకించారు. స్థానిక కళా పునర్వి హ్యాండ్లూమ్ యూనిట్లో దారం నుంచి చీర తయారీ వరకు జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కళాకారుల శ్రమ డిజైన్ల సృజనాత్మక కళా నైపుణ్యాన్ని చూసి అబ్బురపడ్డారు.
స్వయంగా రాట్నంతో నూలు వడికారు. చేనేత మగ్గంలో వస్త్ర తయారీ ప్రక్రియలను పరిశీలించారు. తయారీ కళాకారులు రూపొందించిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. సాంప్రదాయ వారసత్వ చేనేత కళతో తెలుగు సంస్కృతి సాంప్రదాయాల వస్త్రాల డిజైన్లను చూసి ప్రసంసించారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, మండల తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డి, చౌటుప్పల్ సీఐ రాములు, ఆర్ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, స్థానిక ఎస్ఐ కంచర్ల భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
Bhoodan Pochampally : పోచంపల్లి ఇక్కత్ చీరలకు ఆఫ్రికా బృందం ఫిదా
Bhoodan Pochampally : పోచంపల్లి ఇక్కత్ చీరలకు ఆఫ్రికా బృందం ఫిదా
Bhoodan Pochampally : పోచంపల్లి ఇక్కత్ చీరలకు ఆఫ్రికా బృందం ఫిదా