భూదాన్‌పోచంపల్లి: పేదింటి ఆడబిడ్డల పాలిట కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరంగా మారాయని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోని సీఎం కేసీఆర్ ఇలాంటి ప్రథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ సందర్భంగా 78 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
అనంతరం 32 మందికి మంజూరైన రేషన్ కార్డులను ఎమ్మెల్యే అందజేశారు. పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి, ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షురాలు బత్తుల మాధవి గౌడ్, నాయకులు పాటి సుధాకర్‌రెడ్డి, నోములు మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.