యాదగిరిగుట్ట, ఏప్రిల్ 29 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని ప్రముఖ తెలుగు సినీ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ దర్శించుకున్నారు. మంగళవారం స్వామివారి కొండకు చేరుకున్న ఆయన నేరుగా ప్రధానాలయంలోకి ప్రవేశించి స్వయంభూ పంచనారసింహ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. స్వామివారి పిలుపుతో దర్శించుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. గతంలో పాత ఆలయంలో స్వామివారి దర్శించుకున్నానని, ప్రస్తుత ఆలయం ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. ఆలయాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, తిరుపతిలో తన సొంత డబ్బులతో కాటేజీ నిర్మించినట్లు, యాదగిరిగుట్టలో సైతం స్వామివారి తనతో ఏం నిర్మించతలిచాడో చూడాలన్నారు.