బీబీనగర్, ఏప్రిల్ 07 : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని ఎంఎస్ఎన్ పరిశ్రమ సమాజ సేవకు కేటాయించాల్సిన సీఎస్ఆర్ నిధులు జమ చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు పిట్టల అశోక్ అన్నారు. ఆ నిధులకు సంబందించిన వివరాలు తెలుపాలని కోరుతూ పార్టీ నాయకులతో కలిసి సోమవారం పంచాయతీ కార్యదర్శి జాకీరుద్దీన్కు ఆర్టీఐ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంఎస్ఎన్ పరిశ్రమ నుండి వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలిపారు. పరిశ్రమ పక్కనే ఉన్న గురుకుల పాఠశాల విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
రోగాలు గ్రామస్తులకు.. లాభాలు పరిశ్రమకు అన్నట్టుగా ఉందన్నారు. సీఎస్ఆర్ ద్వారా బీబీనగర్ గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు జమ చేయకుండా పరిశ్రమ యాజమాన్యం వ్యవహరిస్తుందని ఆరోపించారు. పరిశ్రమ కేటాయించిన సీఎస్ఆర్ నిధుల పూర్తి వివరాల కోసం ఆర్టీఐ దరఖాస్తు అందజేసినట్లు, పరిశ్రమ నుండి వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి గ్రామస్తుల సహకారంతో పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చెంగలి వెంకట కిషన్‌రావు, నాయకులు పంజాల ఈశ్వర్‌గౌడ్, ఎండీ.కుతుబుద్దీన్, మత్తోజు అశోక్‌చారి, మరి శ్రీకాంత్ పాల్గొన్నారు.