బీబీనగర్, జూలై 17 : బీబీనగర్ మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. ఓ ప్రైవేట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో తలెత్తిన విభేదాలతో బాధితుల ఫిర్యాదు మేరకు డీఎస్పీ జగదీశ్చంద్ర ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముందుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆవరణలో ఉన్న డాక్యుమెంట్ రైటర్ల ఆఫీసులను బంద్ చేశారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టారు.