రామన్నపేట, జూలై 06 : రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన గూనీ నరేష్ కుమార్తె గూనీ అభినయశ్రీ రగ్బీ 75 చాంపియన్ షిప్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. సోమవారం నాడు హైదారబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగీ అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగిన జూనియర్ నేషనల్ రగ్బీ 75 చాంపియన్ షిప్ 2026 సంవత్సరమునకు తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. ఎంపిక పట్ల రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు మడూరి ప్రభాకర్‌రావు, జనరల్ సెక్రటరీ అంబటి రేణుక, వెల్లంకి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తంగెళ్ల సురేందర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.