యాదాద్రి: శ్రావణ మాసం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 17 నుంచి పవిత్రోత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు మూడు రోజులు పాటు జరిగే ఉత్సవాల నిర్వహణకు ఆలయంలో సర్వం సిద్ధం చేశారు.
ఉత్సవాల నేపథ్యంలో హోమాదులు నిర్వహించేందుకు బాలాలయంలో యాగశాలను ఏర్పాటు చేశారు. ఏడాది పాటు ఆలయంలో పూజల్లో, భక్తుల నుంచి తెలిసి తెలియక జరిగిన తప్పులు, దోషాలను చెరిగిపోయేందుకు ప్రతి సంవత్సరం పవిత్ర ఉత్సవాలను నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు.