నీలగిరి, సెప్టెంబర్ 02 : నల్లగొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఐతంవారిగూడెం, పెద్దసూరారం-2, వడ్డెరగూడెం, లచ్చగూడెం, గొల్లగూడ -2 మాన్యంబావి-3, కన్నయ్య బావి తండా అంగన్వాడీ టీచర్లు అలాగే ఆయాల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థుల ఇంటర్వ్యూలు వాయిదా వేయబడినవి. తొలుత ఈ నెల 3న ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యులు నిర్వహించనున్నట్లు పేర్కొనగా తాజాగా ఈ నెల 08న నిర్వహించనున్నట్లు సీడీపీఓ చంద్రకళ బుధవారం తెలిపారు. ఆర్డీఓ కార్యాలయం నల్లగొండ వేదికగా ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు కాల్ లేటర్, ఒరిజినల్ ధృవీకరణ పత్రాలు, ఒక సెట్ జీరాక్స్, రెండు పాస్ ఫొటోలతో ఇంటర్వ్యుకు హాజరు కావాలని పేర్కొన్నారు.