అర్వపల్లి, సెప్టెంబర్ 02 : గీత కార్మికులు కాటమయ్య రక్షణ సేఫ్టీ కిట్టులను సద్వినియోగం చేసుకుని ప్రాణాలను కాపాడుకోవాలని తెలంగాణ గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. బుధవారం అర్వపల్లి మండల కేంద్రంలో తెలంగాణ గౌడ యువజన సంఘం మండల అధ్యక్షుడు కొప్పు జలంధర్ గౌడ్ ఆధ్వర్యంలో కాటమయ్య రక్షణ కిట్ల ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ మణికంఠ నాగేశ్వరరావు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అంజయ్య, గీత కార్మికులు యాదగిరి గౌడ్, ఎల్లయ్య, నరేందర్, సురేందర్, అంజయ్య, యాదగిరి, వెంకన్న, సైదులు పాల్గొన్నారు.