ఆత్మకూరు(ఎం), అక్టోబర్1: రాష్ట్రం ప్రభు త్వం ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా అందిస్తున్న చీరెలను శనివారం నుంచి పంపిణీ చేయనున్నట్లు తాసీల్దార్ జ్యోతి తెలిపారు. శుక్రవారం తాసీల్దార్ కార్యాలయానికి బతుకమ్మ చీరెలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు 7940 చీరెలు జిల్లా కేంద్రం నుంచి మండలానికి వచ్చినట్లు తెలిపారు.
గ్రామాలకు తరలింపు
తుర్కపల్లి, అక్టోబర్ 1: మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయానికి బతుకమ్మ చీరెలు చేరుకున్నాయి. వివిధ గ్రామాల పరిధిలో పంపిణీ చేసేందుకు వాహనాల్లో మండలంలోని అన్ని గ్రామాలకు చీరలను తరలిస్తున్నట్లు తాసీల్దార్ జ్యోతి తెలిపారు.
పంపిణీకి సిద్ధంగా బతుకమ్మ సారె
మోటకొండూర్, అక్టోబర్ 1: మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయానికి శుక్రవారం బతుకమ్మ చీరెలు చేరుకున్నాయి. తాసీల్దార్ రాము, ఆర్ఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో చీరెలను మండలంలోని గ్రామాలకు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8,760 చీరెలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
గుండాల, అక్టోబర్ 1: బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం మహిళల కోసం పంపించిన చీరెలను శనివారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పంపిణీ చేయనున్నట్లు తాసీల్దార్ దయాకర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని వాసవి గార్డెన్స్‌లో మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలానికి 11,798 చీరెలు వచ్చాయన్నారు.