
రాజాపేట, ఆగస్టు 30: బైక్‌పై వాగుదాటుతుండగా వరద ఉధృతికి ఇద్దరు యువతులు గల్లంతుకాగా మరో వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడు. ఈ ఘట న మండలంలోని పాముకుంట కుర్రా రం రోడ్డులోని దోసరవాగులో సోమ వారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం జనగాం జిల్లా దేవురుప్పుల మండలంలోని చిన్నమాడూరు ఎంపీటీసీ సుజాతమల్లికార్జున్ దంపతుల కూతురు సింధూజ(26), రాజాపేట మండలంలోని బొందుగుల చెందిన ఆంజనేయులు పద్మ దంపతుల కూతు రు హిమబిందు(23), మండలంలోని బొందుగులలో జరిగే శుభాకార్యానికి యాదగిరిగుట్ట నుంచి బాబాయ్ వరుసైన శ్రవణ్‌కుమార్ బైక్‌పై ముగ్గురు బయలుదేరారు. సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి బొందుగుల వెళ్లే దారిలో ఉన్న పారుపల్లి వాగు వరద ఉధృతికి రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో వారు దారి మళ్లించి కుర్రారం మీదుగా బొం దుగులకు వెళ్తున్న క్రమంలో పాముకుంట దోసరవాగు దాటుతుండగా వరద ఉధృతికి వాగు మధ్యలో బైక్ అదుపు తప్పి ముగ్గురు వరదలో కొట్టుకపోయారు. కొద్దిదూరం కొట్టుకుపోయిన శ్రవణ్‌కుమార్ అతికష్టం మీద ఒడ్డుకు చేరుకొని ప్రాణాలతో బయట పడగా, ఇద్దరు యువతులు వరదలో గల్లంతయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, యాదగిరిగుట్ట సీఐ ఆంజనేయులు, ఎస్సై శ్రీధర్‌రెడ్డి, తహసీల్దార్ జయమ్మ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తుల సహకారంతో పోలీసులు గల్లంతైన యువతుల కోసం గాలింపు చర్య లు చేపట్టారు.పారుపల్లి సమీపంలోని వాగులో కంప చెట్లలో యువతి సిం ధూజ మృతదేహం లభ్యం కాగా మరో యువతి హిమబింధు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. లభ్యమైన యువతి సింధూజ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.