Kiran Abbavaram | టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్లో మరో భారీ అడుగు వేయబోతున్నారు. ‘క’ (KA) చిత్రంతో పాన్-ఇండియా స్థాయిలో తన సత్తా చాటిన కిరణ్, ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా (Ess Kay Gee Entertainment) నిర్మాణంలో ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌కు సంతకం చేసినట్లు తెలుస్తుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్‌తో కలిసి ప్రేరణ అరోరా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనుండగా, కీర్తన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారతీయ సంస్కృతి మరియు పురాణాల నేపథ్యంలో సాగే ఒక అద్భుతమైన మైథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఈ సినిమా కోసం మేకర్స్ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు. గ్రాండ్ విజువల్స్ మరియు హై టెక్నికల్ వాల్యూస్‌తో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ లేదా టాలీవుడ్‌కు చెందిన ఒక అగ్ర నటిని హీరోయిన్గా ఎంపిక చేసే ప్రక్రియలో చిత్ర యూనిట్ ఉంది.
భక్తి, భావోద్వేగాలు, డ్రామా మరియు హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ల కలయికతో ఈ కథ ఉండబోతోందని, ప్రేక్షకులకు ఇది ఒక సరికొత్త దృశ్యకావ్యాన్ని అందిస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమా టైటిల్, దర్శకుడు మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. ‘క’ సినిమా విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కిరణ్ అబ్బవరం, ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌తో బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేయాలని సిద్ధమవుతున్నారు.