తొలిరోజు అన్నదానాలు, పండ్ల పంపిణీ
పాల్గొన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు
ఆలేరు, ఫిబ్రవరి 15 : సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు పల్లె పల్లెనా ప్రారంభమయ్యాయి. మూడ్రోజుల వేడుకల్లో భాగంగా మంగళవారం ఆలేరులో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ ఆత్మబంధువుగా నిలిచారని అన్నారు. ఈనెల 16,17 తేదీల్లో గ్రామాలు, పట్టణాల్లో వేడుకలు ఘనంగా జరుగాలన్నారు. ఈ పండుగలో అన్ని వర్గాలు భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశం, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశం, మండలాధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రజల ఆత్మబంధువు కేసీఆర్ : కంచర్ల
చౌటుప్పల్ రూరల్ : దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రజల ఆత్మబంధువుగా నిలిచిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని ఎల్లగిరిలోని మానసిక వికలాంగుల ఆశ్రమంలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో మొక్కను నాటి నీళ్లు పోశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ ఇందిరాసత్తిరెడ్డి, కొత్త పర్వతాలు యాదవ్, ముప్పిడి శ్రీనివాస్‌గౌడ్, సుర్వి మల్లేశ్‌గౌడ్, బుచ్చిరెడ్డి, మాధవరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
మోత్కూరు : సీఎం కేసీఆర్ నిరంతర కృషీవలుడని జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డితో కలిసి మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో మంగళవారం అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, పీఏసీఎస్ చైర్మన్ కంచర్ల అశోక్‌రెడ్డి, నార్మాక్స్ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రాంపాక నాగయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు పురగుల వెంకన్న, వనం స్వామి, కూరెళ్ల కుమారస్వామి, మలిపెద్ది రజిత, దబ్బెటి విజయారమేష్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ కొండ సోంమల్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం : రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అని ఎంపీపీ గుత్తా ఉమాప్రేమ్చందర్రెడ్డి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీగౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా టీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి రోగులకు మంగళవారం పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు లారీ భిక్షం, పీఏసీఏస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి,ఎంపీటీసీ ఈసం యాదయ్య, నాయకులు యాదిరెడ్డి, ప్రముఖ్‌రెడ్డి, నర్రి నర్సింహ, చిలువేరు ముత్యాలు పాల్గొన్నారు.
ఆత్మకూర్(ఎం)లో దుప్పట్ల పంపిణీ
ఆత్మకూరు(ఎం) : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబాలకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథగౌడ్ దుప్పట్లు పంపిణీ చేశారు.
మోటకొండూర్‌లో పండ్ల పంపిణీ
మోటకొండూర్ : సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు టీఆర్ఎస్ శ్రేణులు పండ్లు పంపిణీ చేశాయి. పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు భూమండ్ల సుధీర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎగ్గిడి బాలయ్య, డైరెక్టర్లు అనంతుల జంగారెడ్డి, బొబ్బల యాదిరెడ్డి, టీఆర్ఎస్ బీసీ సెల్ మండలాధ్యక్షుడు గౌరయ్య, నాయకులు బొట్ల మహేశ్, గంధమల్ల మధు, నర్సింహులుయాదవ్, నర్సింహ, భాస్కర్, శ్రీశైలం, పాండు, నవీన్ పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : మండలంలోని తాజ్పూర్ గ్రామంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా నమాత్‌పల్లి, చందుపట్ల గ్రామాలతో పాటు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పండ్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో తాజ్పూర్ గ్రామ సర్పంచ్ బొమ్మారపు సురేశ్, వార్డు సభ్యులు కొండల్, సందీప్, రామస్వామి, టీఆర్ఎస్ నాయకులు వరిగంటి రమేశ్, యాకుబ్, ఉడుత రాజు, సాయికుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.
చౌటుప్పల్ రూరల్ : పట్టణకేంద్రంలోని అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్ పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బొంగు జంగయ్యగౌడ్, ఊడుగు మల్లేశ్‌గౌడ్, తడక కిరణ్, రహీం, స్వామిగౌడ్, రాజు, అమర్, రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
వలిగొండ : టీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలోని పీహెచ్సీ రోగులకు పండ్లు, 80మంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎమ్మె లింగస్వామి, మండల ప్రధాన కార్యదర్శి మామిం డ్ల రత్తయ్య, శాంతికుమార్, గ్రంథాలయ చైర్మన్ వెంకటరమణ, నర్సింహ, నరేశ్ పాల్గొన్నారు.
బీబీనగర్ : మండల కేంద్రంలోని పీహెచ్సీలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఎంపీపీ ఎర్కల సుధాకర్, రాష్ట్ర నాయకుడు గోలి పింగళ్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ జైపాల్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వ మోహన్‌రెడ్డి, సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మిశ్రీనివాస్ పాల్గొన్నారు.
బీబీనగర్, ( భూదాన్ పోచంపల్లి ) : టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. యువజన విభాగం మండలాధ్యక్షుడు శ్రీకాంత్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బోయిని పరమేశ్, నాయకులు పాల్గొన్నారు.
అడ్డగూడూరు : మండలకేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు అన్నదానం చేయడంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ జ్యోతీఅయోధ్య, సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహేంద్రనాథ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సత్యంగౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నేడు గుట్టలో రక్తదాన శిబిరం
యాదాద్రి : సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరి ఆస్పత్రిలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ముఖ్యర్ల సతీశ్‌యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
17న రైతులకు సన్మానం..
యాదగిరిగుట్ట రూరల్ : సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈనెల 17న మండలంలోని వంగపల్లి రైతు వేదిక వద్ద నిర్వహించే రైతుల సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేపాక స్వామి పిలుపునిచ్చారు. మంగళవారం వంగపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. టీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు కానుగు రాజీవ్ వార్డు సభ్యులు యడపల్లి గాయత్రి, బండి మహేశ్, యడపల్లి మహేశ్, హబీబ్ పాల్గొన్నారు.
కారణజన్ముడు సీఎం కేసీఆర్; ఎమ్మెల్యే చిరుమర్తి
రామన్నపేట : రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేసిన కారణ జన్ముడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అన్నదానం చేశారు. దవాకానలో రోగులు, బాలింతలకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.. కేసీఆర్ వ్యక్తి కాదని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడు అని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వ పటిమతో పల్లెలు, పట్టణాలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయని తెలిపారు. నార్మాక్స్ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్‌రెడ్డి, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, సర్పంచులు నంద్యాల భిక్షంరెడ్డి, ఎడ్ల మహేందర్‌రెడ్డి, అప్పం లక్ష్మీనర్సు, పిట్ట కృష్ణారెడి,్డ మెట్టు మహేందర్‌రెడ్డి, ఉప్పు ప్రకాశ్, చెరుకు సోమయ్య, ఎంపీటీసీలు మహేందర్‌రెడ్డి, సతీశ్, నర్సింహ, ఆమేర్, పట్టణాధ్యక్షుడు సాయి, నాయకులు జగన్మోహన్, రమేశ్, దయాకర్, రాములు, మల్లేశం, శ్రీనివాస్, రమేశ్, వెంకటేశం, ముత్తయ్య, పురుషోత్తంరెడ్డి, విక్రం, ఇనాయతుల్లా పాల్గొన్నారు.