
తుర్కపల్లి, ఆగస్టు6: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం చరిత్రలో నిలిచిపోతుందని టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బర్ల లచ్చయ్య, ఆ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. వాసాలమర్రి గ్రామంలోని దళిత కుటుంబాలకు దళితబంధు పథకం కింద నిధులను మంజూరు చేయడాన్ని హర్షిస్తూ శుక్రవారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి టీఆర్ఎస్ నాయకులతో కలిసి వారు క్షీరాభిషేకం చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాసాలమర్రికి చెందిన 76 దళిత కుటుంబాలకు రాష్ట్రంలోనే ప్రథమంగా దళితబంధు పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున నిధులను మంజూరు చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుశీలారవీందర్, జడ్పీవైస్‌చైర్మన్ భీకునాయక్, రైతుబంధుసమితి మండల కన్వీనర్ నర్సింహులు, సర్పంచ్వనితాశ్రీనివాస్, ఎంపీటీసీలు కరుణాకర్, శ్రీనివాస్, శ్రీకాంత్, బాలస్వామి, నాగరాజు తదితరులున్నారు.
దళితులు ఆర్థికంగా ఎదగాలి
దళితబంధు పథకం కింద మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకుని దళితులు ఆర్థికంగా ఎదగాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ అన్నారు. సీఎం కేసీఆర్ వాసాలమర్రికి చెందిన 76 దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నిధులను ప్రకటించడమేకాక 24 గంటల్లోనే మంజూరు చేశారు. అందులో భాగంగా శుక్రవారం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గ్రా మంలోని దళితవాడను సందర్శించారు. ఇంటింటికీ తిరిగి దళిత కుటుంబాలకు నిధుల వినియోగంపై అవగాహన కల్పించారు. కుటుంబ సభ్యుల వివరాలు, ఆర్థిక స్థితిగతులు, విద్య, వృత్తి నైపు ణ్యం, ప్రస్తుతం చేస్తున్న పని తదితర అంశాలను సేకరించారు. నిధులను ఏవిధంగా వినియోగించుకుంటారో అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు పథకం నిధులను సొంతానికి వాడుకోవద్దన్నారు. అనుభవం ఉన్న రంగాల్లో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో సర్పం చ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఫీల్డ్ ఆఫీసర్ మంగరాజ్ శ్రవణ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి నర్సింహాచారి తదితరులున్నారు.
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
బీబీనగర్, ఆగస్టు6: దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు దళిత సమాజం అండగా నిలవాలని జడ్పీటీసీ ప్రణీతాపింగళ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె మండల కేంద్రంలోని పోచంపల్లి చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డిల ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వాసాలమర్రి గ్రామంలో అనుకున్న విధంగా దళి తబంధు పథకాన్ని అమలు చేసి దళితుల బ్యాంకు ఖాతాల్లో రూ.10లక్షల చొప్పున జమ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ గణేశ్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రవికుమార్, మార్కె ట్ కమిటీ వైస్ చైర్మన్ మోహన్‌రెడ్డి, నరహరి, నగేశ్, బాల్‌చందర్, శ్రీనివాస్, బాలమణి, వేణు, రాజేందర్ పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
రాజాపేట, ఆగస్టు6: దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామంలో అమలు చేయ డం హర్షణీయమని ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మ న్ గడ్డమీది రవీందర్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని రఘునాథపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టడంతో దళితులందరూ సీఎం కేసీఆర్ వెంటే ఉంటారన్నారు. వాసాలమర్రిలో హామీ ఇచ్చిన మేరకు 24 గంటల్లోనే దళితబంధు నిధులను కేటాయించిన సీఎం కేసీఆర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకాన్ని దళితులందరూ సద్వినియో గం చేసుకోవాలన్నారు. సమావేశంలో సందిల భాస్కర్‌గౌడ్, పల్లె సంతోశ్‌గౌడ్, కటకం స్వామి, శివ, నవీన్, రాజు, వెంకట్ పాల్గొన్నారు.
‘దళితబంధు’ను స్వాగతిస్తున్నాం
ఆత్మకూరు(ఎం), ఆగస్టు6: సీఎం కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరెళ్ల రమేశ్ అన్నా రు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో జరిగిన సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. ‘దళిత బంధు’తో ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున అందజేయడంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో టీఎమార్పీఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు పరశురాములు, నవీన్, గణేశ్, రవీందర్, ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ వెంకటేశ్, చంద్రయ్య, రాజయ్య