
యాదాద్రి, ఆగస్టు 30: టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో ఆలేరు నియోజకవర్గం రాష్ట్రంలో మూడోస్థానంలో నిలిచిందని ప్రభుత్వవిప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి వెల్లడించారు.ఆలేరులో కాంగ్రెస్, బీజేపీలకు స్థానంలేదని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే నెల 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నియోజకవర్గంలోని 8 మండలాల్లో టీఆర్ఎస్ నూతన కార్యవర్గాల ఏర్పాటుపై పార్టీ శ్రేణులతో చర్చించారు. ఆయా మండలాల్లో కార్యవర్గాల ఎన్నికపై ఇన్చార్జీలను నియమించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదీన జెండా పండుగ నేపథ్యంలో గల్లీగల్లీలో గులాబీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గం వ్యాప్తంగా 8 మండలాలు, 188 గ్రామాలు, రెండు మున్సిపాలిటీలతో పాటు మధిర ప్రాంతాలను కలుపుకుని 324 గ్రామాల్లో టీఆర్ఎస్ను బలోపేతం చేయాలన్నారు. పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయన్నారు.ఆలేరు నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తారని పలువురు మాట్లాడుతున్నారని, ఆదే జరిగితే అంతకంటే ఇంకా ఏమికావాలన్నారు. 4 కోట్ల మంది గుండెల్లో నిలిచిన సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు ఆలేరు నుంచి పోటీ చేస్తానంటే పూర్తిస్థాయిలో స్వాగతిస్తామన్నారు. కొంత మంది నాయకులు మళ్లీ రోడ్డుపైకి వచ్చి ఇష్టమెచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారి నిరాధారమైన ఆరోపణలను యువత ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని అభిప్రాయపడ్డారు.
బ్రోకర్, జోకర్లను ప్రజలు నమ్మరు
బ్రోకర్ రేవంత్‌రెడ్డి, జోకర్ బండి సంజయ్‌లను ప్రజలు నమ్మే పరిస్థితిలేనది ఎన్డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి చంద్రబాబు కోవర్టు అని ఆరోపించారు. వంగపల్లిలో జరిగిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలోఆయన పాల్గొని టీఆర్ఎస్ నూతన కార్యవర్గాలపై దిశానిర్దేశం చేశారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో దళితబంధు, రైతుబంధు, కల్యాణలక్ష్మీ పథకాలను అమలు చేసి విమర్శించాలని గుర్తు చేశారు. 2014 యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా ఈ ఏడాదిలో 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి, దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. వచ్చేనెల 2వ తేదీన పార్టీ అధిష్టానం పిలుపుమేరకు టీఆర్ఎస్ జెండా పండుగను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌డీఏ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బీకూ నాయక్, మార్కెట్‌కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, టీఆర్ఎస్ పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, దూదిపాల రవీందర్‌రెడ్డి, పడాల శ్రీనివాస్, బాషబోయిన ఉప్పలయ్య, గంగుల శ్రీనివాస్, వెంకటేశ్‌గౌడ్, నాగిర్తి రాజిరెడ్డి, ఇమ్మడి దశరథ, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ, ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, వివిధ మండలాల జడ్పీటీసీలు తోటకూరి అనురాధ, పల్లా వెంకట్‌రెడ్డి, కోలుకొండ లక్ష్మీ, వివిధ మండలాల ఎంపీపీలు తాండ్ర అమరావతి, భూక్యా సుశీల, జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండీ ఖలీల్, ఎంపీటీసీలు రేపాక మౌనిక, పన్నాల అంజిరెడ్డి, నాయకులు మిట్ట వెంకటయ్య, మదర్డైయిరీ డైరెక్టర్లు కళ్లెపల్లి శ్రీశైలం, లింగాల శ్రీకర్‌రెడ్డి, అర్కాల గాల్‌రెడ్డి, దొంతిరి సోమిరెడ్డి, చింతలపూడి వెంకటరామిరెడ్డి, మోతె పూలమ్మ పాల్గొన్నారు.