భువనగిరి కలెక్టరేట్, జూన్ 1 : రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సమీకృత కలెక్టర్ కార్యాలయం విద్యుత్ దీపకాంతులతో అందంగా ముస్తాబైంది. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమాలకు విశ్రాంత ప్రభుత్వ సలహాదారు ఎకే.ఖాన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు.
ఆవిర్భావ వేడుకల్లో భాగం గా గురువారం ఉదయం 8.30గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి, 9గంటలకు కలెక్టరేట్లో జాతీయ జెండా ఆవిష్కరణ, 9.15గ ంటలకు ముఖ్య అతిథి ప్రసంగం ఉంటుందని కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. అనంతరం తేనేటి విందు, మధ్యాహ్నం 2గంటలకు కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించే ఆవిర్భావ వేడుకల పనులను అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు.