Chalamalla Krishna Reddy | భువనగిరి కలెక్టరేట్, ఫిబ్రవరి 18 : హైదరాబాద్‌కు చెందిన కొందరు లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే దొంగ చాటున క్యూ లైన్లో నిలబడి కండువా కప్పించుకున్న చలమల్ల కృష్ణారెడ్డి చేరిక చెల్లదని యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీలో కొనసాగుతున్న చలమల కృష్ణారెడ్డి జిల్లాకు చెందిన ఏ నాయకులకు సమాచారం ఇవ్వకుండా పార్టీలో చేరడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
గడిచిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం ప్రయత్నించిన చలమల కృష్ణారెడ్డి జిల్లా ముఖ్య నేతలతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై దుర్భాషలాడాడని పేర్కొన్నారు. కృష్ణారెడ్డి తన చీకటి వ్యాపారాలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరాడని, పార్టీలో ఆయన చేరికల చెల్లదని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.