యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): పాలనలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు తనదైన ముద్ర వేసుకున్నారు. జిల్లాలో తన మారు చూపుతూ వినూత్న కార్యక్రమాలతో ప్రజలతో మమేకమయ్యారు. మంగళవారం నాటి తో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్నారు. ఆయ న జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే విద్య, వైద్య, ఇందిరమ్మ ఇండ్లు, అమ్మకు భరోసా, పల్లె నిద్ర,హాస్టల్ నిద్ర, ప్రజావాణి, ఉద్యోగ వాణి తదితర కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
వివిధ ప్రభుత్వ విద్యా సంస్థలను ఆకస్మిక తనిఖీ చేస్తూ, రాత్రిళ్లు అక్కడే బస చేస్తున్నారు. పాఠాలు బోధిస్తూ…విద్యాలయాల్లో వసతులు పరిశీలిస్తున్నారు. గత సంవత్సరం పదో తరగతిలో అత్యధిక మారులు సాధించిన 200 మంది విద్యార్థులకు సైకిళ్లు బహుమతిగా అందజేశారు. అం గన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తూ పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అమ్మకు భరోసా కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటూ న్యూట్రిషన్ కిట్లు, మందులు అందజేయడంలో కీలక పాత్ర పోషించారు.
జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖాన, అన్ని మండలాల్లోని పీహెచ్సీలు, సీహెచ్సీలు, పల్లె దవఖానలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నారు. ప్రతి గురువారం ప్రజా సమస్యలపై ప్రజావాణి, ఉద్యోగుల కోసం ఉద్యోగవాణి నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల సత్వర పరిషారం కోసం పల్లె నిద్ర కార్యక్రమం తీసుకొచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జిల్లాను మొదటి స్థానంలో నిలపడంలో ఆయన కృషి అమోఘం.