నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 12 : కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయ సాధనకు కృషి చేయాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున అన్నారు. ఏచూరి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున, మండల కార్యదర్శి నలపరాజు సైదులు మాట్లాడుతూ.. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి అన్నారు. విప్లవ ధ్రువతార, కమ్యూనిస్టు పార్టీ ఐకాన్ అయిన ఏచూరి ఆశయ సాధనకు ప్రతి ఒక్క కమ్యూనిస్టు కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కొండ అనురాధ, మండల కమిటీ సభ్యులు జిల్లా అంజయ్య, బొల్లు రవీందర్, కొండా వెంకన్న, జంజరాల శ్రీనివాస్, కట్ట అంజయ్య, గోలి నరసింహ, కుడ్తాల భూపాల్, కండె యాదగిరి, భూతరాజు మహేశ్, కుందారపు సైదులు, గోలి శరత్ పాల్గొన్నారు.