కట్టంగూర్, అక్టోబర్ 17 : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలు అడిగిన వెంటనే పనులు కల్పించాలని ఏపీడీ యామిని అన్నారు. కట్టంగూర్ మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా 1-4-2024 నుండి 31-3-2025 వరకు జరిగిన పనులపై శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో 15వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను నిర్వహించారు. మండలంలోని 22 గ్రామాల్లో చేపట్టిన వివిధ పనులపై నివేదికను చదివి వినిపించారు.
మండలంలో మొత్తం రూ.6,010,55,35 కోట్లు ఖర్చు చేయగా కూలీలకు రూ.5,87,66,440, సామాగ్రికి రూ.1,33,90,96 చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఉపాధి హామీ సిబ్బందితో పాటు పంచాయితీ కార్యదర్శుల నుంచి రూ.266ను రికవరీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ టీ ఎం వేణు, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞాన ప్రకాష్ రావు, డీవీఓ చకిలం వేణుగోపాలరావు, అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ గౌతమి, ఎంపీఓ స్వరూపారాణి, ఏపీఓ కడెం రాంమోహన్, పీఆర్ ఏఈ జమీల్, కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.